Sep 06,2023 17:10

 టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, వికెట్‌ కీపర్‌ ఇషన్‌ కిషన్‌లు వన్డే ర్యాంకింగ్స్‌లో సత్తా చాటారు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో కెరీర్‌ అత్యుత్తమ ర్యాంకులు దక్కించుకున్నారు. బుధవారం సాయంత్రం ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ 750 రేటింగ్‌ పాయింట్స్‌తో అత్యుత్తమ మూడో స్థానంలో నిలిచాడు. ఇక ఇషన్‌ కిషన్‌ 624 రేటింగ్‌ పాయింట్లతో 24వ ర్యాంకుకు ఎగబాకాడు. ఆసియాకప్‌-2023లో భాగంగా నేపాల్‌తో మ్యాచ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ 67పరుగులు, పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ 82 పరుగులు చేశారు.

టాప్‌ 10 వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్‌ జాబితా
1.బాబర్‌ ఆజం (పాకిస్తాన్‌)
2.రస్సీ వాండర్‌ డస్సెన్‌ (దక్షిణాఫ్రికా)
3.శుబ్‌మన్‌ గిల్‌(భారత్‌)
4.ఇమామ్‌-ఉల్‌-హక్‌ (పాకిస్తాన్‌)
5.హ్యారీ టెక్టర్‌ (ఐర్లాండ్‌)
6.డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా)
7.ఫఖర్‌ జమాన్‌ (పాకిస్తాన్‌)
8.క్వింటన్‌ డి కాక్‌ (దక్షిణాఫ్రికా)
9.స్టీవ్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా)
10.విరాట్‌ కోహ్లీ (భారత్‌)