డెంగ్యూ బారిన పడ్డ యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ వన్డే వరల్డ్‌కప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఆరోగ్యంపై బిసిసిఐ కీలక అప్‌డేట్ అందించింది. ఢిల్లీ వేదికగా బుధవారం (అక్టోబర్ 11న) అఫ్గాన్‌తో జరిగే మ్యాచ్‌కు గిల్ అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ ట్విటర్ వేదికగా తెలిపింది. అతడు చెన్నైలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని పేర్కొంది. భారత జట్టుతో కలిసి ఢిల్లీకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది.










