Oct 02,2023 13:30

ప్రజాశక్తి - భీమవరం (పశ్చిమ గోదావరి) : కల్లుగీత కార్మికుల సమస్యలను పరిష్కరించి సంక్షోభంలో ఉన్న కల్లుగీత కార్మికులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ కల్లుగీత కార్మిక సంఘం డిమాండ్‌ చేసింది. సోమవారం కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో భీమవరం లో గాంధీ విగ్రహానికి మెమొరాండమును అందజేశారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కల్లుగీత కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని నినదించారు.

ఈ సందర్బంగా కల్లు గీత కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షులు జూత్తిగ నర్సింహామూర్తి మాట్లాడారు. గీత వఅత్తి ప్రమాదం అని తెలిసినా ప్రభుత్వం ఆదుకోకపోయినప్పటికీ లక్షలాదిమంది గీత కార్మికుల వఅత్తి చేస్తున్నారని చెప్పారు. పాదయాత్రలో జగన్‌ గీత కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటైనా అమలు చేయకపోవటం వల్ల గీత కార్మికులు అభద్రత భావనలో ఉన్నారని తెలిపారు. అక్రమ మద్యం, కల్తీ మద్యం, చీప్‌ లిక్కరు అరికట్టకపోవడం, మొబైల్‌ మద్యం వ్యాపారంను ప్రోత్సహించడం వల్ల కల్లు అమ్మకాలు పూర్తిగా దెబ్బ తిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వంలో గీత కార్మికులు బతకలేని పరిస్థితికి వచ్చారని ఆందోళన చెందారు. కులాల కార్పొరేషన్‌ లు పెట్టి గీత కార్మికుల కొంపలు ముంచారన్నారు. ఇటీవల కాలంలో 110 మంది గీత కార్మికులు తాటి చెట్ల పై నుండి పడి చనిపోయారని చెప్పారు. చనిపోయినవారికి కానీ, శాశ్వత వికలాంగులు అయినవారికి కానీ... ఎక్స్‌గ్రేషియో రాకపోవడంతో ఘల్లుమంటున్నారని తెలిపారు. ఎన్నికల్లో గీత కార్మికుల ఓట్లు కావాలి అని అడుగుతారే తప్ప వారి సంక్షేమం వఅత్తి రక్షణ, ఉపాధి, వఅత్తి ఆధునికీకరణ ఈ ప్రభుత్వానికి అక్కరలేదని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఎక్స్‌ సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా అందించాలని కోరారు. వఅత్తి చేస్తు ప్రమాదంలో చనిపోయినవారి దహన సంస్కార ఖర్చులకు రూ.25 వేలు, దెబ్బలు తగిలినవారికీ రూ.15 వేలు వైద్య ఖర్చులకు తక్షణమే ఇవ్వాలి అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గీత వఅత్తిని ఆధునికరించాలని, అక్రమ మద్యం, కల్తీ మద్యం, చీప్‌ లిక్కర్‌, బెల్ట్‌ షాప్‌ లు తక్షణమే అరికట్టాలని డిమాండ్‌ చేశారు. కల్లు గీసే వారి అందరికి ఉపయోగ పడే విధంగా బైక్‌లు ఇవ్వాలని అన్నారు. తాటి చెట్లను ఇష్టానుసారం గా నరికి వేస్తున్న వారిపై చట్ట ప్రకారం కేసులు పెట్టి అరెస్టు చేయాలని అడిగారు. నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కాగిత రాధా కఅష్ట్ణ, చింతపల్లి చిన వీరస్వామి, కడలి పాండు, దొంగ సాయిబాబు, తంగెళ్ల నరసింహస్వామి, వీరవల్లి శ్రీనివాసు, మామిడిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.