
ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : కశింకోట మండలం తాళ్ళపాలెం శ్రీ గాయత్రీ ప్రైమరీ హైస్కూల్ విద్యార్థి కాలెపు తేజస్విని శ్రీకాకుళం త్రిబుల్ ఐటీకి ఎంపికయ్యింది అని పాఠశాల కరస్పాండెంట్ బి కుమార్ శనివారం తెలిపారు. ఎంపిక అయిన విద్యార్థిని పాఠశాలలో అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకుడు అయినాల అప్పారావు, ప్రిన్సిపాల్ నగేష్ సహా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.