ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మూడేళ్లలో వంట గ్యాస్ ధర 20 సార్లు పెరిగింది. లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర 2020 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 1 వరకు మొత్తం 20 సార్లు పెరిగిందని తెలిపారు. 2020 ఏప్రిల్ 1న వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.714.5 ఉండగా, 2023 మార్చి 1 నాటికి రూ.1,102.50కి పెరిగిందని తెలిపారు.