Aug 10,2023 13:38

ప్రజాశక్తి-వన్‌ టౌన్‌ (విజయవాడ) : ముఠా కార్మికుల కూలి రేట్లు పెంచాలని, గత నెల రోజులుగా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ యాజమాన్యాలు ముందుకు రాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం వన్‌ టౌన్‌ చిట్టూరి కాంప్లెక్స్‌ వద్ద ముఠా కార్మికుల సమ్మెలోకి దిగారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సిఐటియు ఎన్టీఆర్‌ జిల్లా ఉపాధ్యక్షులు డివి కఅష్ణ, సిఐటియు ముఠా కార్మికులు నాయకులు ఎం.సీతారాములు, ఏఐటియుసి నాగేశ్వరరావు పాల్గని మాట్లాడుతూ ... కూలి రెండేళ్లకి ఒకసారి పెంచాల్సి ఉందని, అయినా యాజమాన్యాలు ముందుకుపోవడంతో గత్యంతరం లేక, ముఠా కార్మికులు సమ్మెలోకి దిగాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా యాజమాన్యాలు స్పందించి పెరిగిన ధరలకనుగుణంగా కూలి రేట్లు పెంచాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను పెంచడంతో కార్మికులపై మరింత భారం పడిందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యజమాన్యాలు, కార్మికుల ఇబ్బందులను దఅష్టిలో ఉంచుకొని కూలి రేట్లు పెంచాలని కోరారు. లేనిపక్షంలో కూలి రేట్లు పెంచే వరకు నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. అనంతరం పలు వీధుల్లో ముఠా కార్మికులు ర్యాలీ నిర్వహించారు.