ప్రజాశక్తి-పోరుమామిళ్ల (కడప) : ఇటీవల పట్టణంలో జరిగిన బంగారం చోరీ కేసును చేదించి, నలుగురు దొంగలను అదుపులోకి తీసుకొని వారి నుంచి తొమ్మిది తులాలు బంగారు, కేజీ వెండిని స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు డిఎస్పి వంశీధర్ గౌడ్ పేర్కొన్నారు. కేసు సిఐ సురేష్ రెడ్డి ఎస్‌ఐ మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో చేదించారన్నారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పి వంశీధర్ గౌడ్ మాట్లాడుతూ.. పట్టణంలోని పరిసర ప్రాంతాలలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. నలుగురు దొంగలను అరెస్టు చేసినట్లు తెలిపారు. బుధవారం బ్రహ్మంగారిమఠం మండలం లింగాలదిన్నె పల్లె గ్రామ సమీపంలో అనుమాస్పదంగా ద్విచక్ర వాహనంలో పట్టుబడ్డారని నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి బంగారు వెండి వస్తువులు స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. నలుగురి నిందితులపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో కేసులు నమోదయ్యాయని తెలిపారు.










