Oct 31,2023 21:08

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని గెయిల్‌ ఇండియా ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 56 శాతం వృద్థితో రూ.2,404.89 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,537.07 కోట్ల లాభాలు ప్రకటించింది. ఇదే సమయంలో రూ.38,490.89 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. క్రితం క్యూ1లో 17 శాతం తగ్గి రూ.31,822.6 కోట్లుగా చోటు చేసుకుంది. మంగళవారం బిఎస్‌ఇలో గెయిల్‌ ఇండియా షేర్లు 1.30 శాతం పెరిగి రూ.119.95 వద్ద ముగిసింది. ప్రస్తుత ఏడాది ప్రారంభం నుంచి ఈ సూచీ 25 శాతం పెరిగింది.