ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి గడపగడపకి కార్యక్రమం జరుగుతుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు. కశింకోట స్థానిక మండల కేంద్రములో గడపగడపకి కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా అమరనాథ్ మాట్లాడుతూ ... ప్రతి ఒక్కరు అర్హత కలవారికి సంక్షేమ పథకాలు అందిస్తాం అని అన్నారు. ఈ గ్రామం లో డ్రైనేజీ, సిసి రొడ్ల నిర్మాణం కోసం కృషి చేస్తానని అన్నారు అభివృద్ధి వైసిపితో సాధ్యం అని చెప్పారు అర్హత పత్రాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి జిల్లా అధికార ప్రతినిధి మళ్ళ బుల్లిబాబు, మండల పరిషత్ అధ్యక్షురాలు కలగా లక్ష్మి , ఉపాధ్యక్షులు పెంటకోట జ్యోతి, సర్పంచ్ మంత్రి జయరజనీ, ఎంపిడిఓ కొంకి అప్పారావు, మండల సమాఖ్య ఎపిఓ శ్రీనివాసరావు, పలుశాఖల అధికారులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.










