హైదరాబాద్ : గోల్డ్‌స్టోన్ టెక్నలాజీస్ లిమిటెడ్ (జిటిఎల్) జర్మనీ ఇ-మొబిలిటీ సంస్థ క్వాంట్రోన్ ఎజితో భాగస్వామ్యం కుదర్చుకుంది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఇరు సంస్థల అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. కృత్రిమ మేధా (ఎఐ)ని ఉపయోగించి ఫ్లీట్ మేనేజ్‌మెంట్ కోసం మొబిలిటీ సొల్యూషన్‌లో మార్పులు తీసుకురానున్నట్లు ప్రకటించారు. అభివద్ధి చెందుతున్న గ్లోబల్ ఎలక్ట్రిక్ మొబిలిటీని ఒడిసి పట్టేందుకు 2023 సెప్టెంబర్ త్రైమాసికం నాటికి అమెరికాలో కూడా ఓ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్దేశించుకున్నట్లు కాంట్రోన్ ఎజి సిఇఒ మైకెల్ పెర్సెక్, జిటిఎల్ ఎండి పవన్ చావలి వెల్లడించారు.










