May 22,2023 11:15

న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌లో సోమవారం నుంచి జి20 టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి 24 వరకు గుల్‌మార్గ్‌ పట్టణంలోని జి20 సదస్సు జరగనుంది. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకొని క్షణ్ణంగా తనిఖీలు నిర్విహించాయి.గుల్‌మార్గ్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.