Jun 12,2023 20:42

ముంబయి : దక్షిణ కొరియాలోని సియోల్‌లోని తమ ప్రధాన కార్యాలయం నుంచి రూ.1,240 కోట్ల మూలధనాన్ని అందుకున్నట్లు మిరే అసెట్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ ప్రకటించింది. దీంతో కలిపి తమ మొత్తం ఫండింగ్‌ విలువ రూ.3,190 కోట్లకు చేరుకుందని పేర్కొంది. నూతన నిధులను తమ రిటైల్‌ స్టాక్‌ బ్రోకింగ్‌ ఎం.స్టాక్‌ ప్లాట్‌ ఫామ్‌ ద్వారా బి2సి వ్యాప్తిని విస్తరించడానికి, సంస్థాగత వ్యాపారానికి, ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ పునాదిని ఏర్పాటు చేయడానికి ఉపయోగించుకోనున్నట్లు తెలిపింది. ఏడాది కాలంలోనే 2.5 లక్షల పెయిడ్‌ అకౌంట్లు, 65 శాతం ఆక్టివ్‌ క్లయింట్ల నుంచి ఎం.స్టాక్‌ రూ.1.4 లక్షల కోట్ల టర్నోవర్‌ సాధించినట్లు తెలిపింది.