
ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : ఆదోనిలోని శివారులోని సిరిగుప్ప చెక్ పోస్ట్ వద్ద ఐరన్ షాపు, పంజర్ పోల్ ఆంజనేయ స్వామి గుడి హుండీ దొంగతనాల కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు వన్‌టౌన్ సీఐ విక్రమ సింహా తెలిపారు. అందిన సమాచారం మేరకు ఆదోనిలోని బాలకొలను గుడి వద్ద వ్యక్తి సంచితో అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని పట్టుకొని విచారించగా ఐరన్ షాపులో రు.1.20 లక్షలు, హుండీ నుంచి రూ.6 వేలు, 15 తులాల వెండి, ఛాతీ కవచం, కన్నులు, పాదాలను దొంగతనం చేసినట్టు అంగీకరించినట్లు విచారణలో తేలిందన్నారు. రూ.1.10 లక్షల నగదు, వస్తువులు స్వాధీనం చేసుకొని ఆదోనిలోని బోయగేరికి చెందిన నరసింహులును అరెస్టుచేసి జుడిషియల్ కస్టడీకి తరలించామన్నారు. దాడుల్లో హెచ్‌సి మద్దిలేటి, రంగస్వామి, లక్ష్మణ, సుధీర్, ముస్తాక్, అశోక్ పాల్గొన్నారు.