Jul 15,2023 12:34

ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : ఆదోని పట్టణంలో శనివారం ఎడ్యుకేషనల్‌ చీఫ్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ ప్రభుత్వ స్కూళ్లను తనిఖీ చేశారు. ఆర్‌ ఆర్‌ లేబర్‌ కాలనీ మున్సిపల్‌ హై స్కూల్‌ సంతపేట మున్సిపల్‌ స్కూల్‌ను సందర్శించారు. సంతపేట మున్సిపల్‌ స్కూల్లో విద్యార్థులను ప్రశ్నలడిగారు. పాఠశాల ప్రారంభమై నెల గడిచినప్పటికీ కనీసం విద్యార్థులు రాసిన హౌంవర్క్‌ ను పరిశీలించకపోవడం ఏమిటని డిస్టిక్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ రంగారెడ్డిని నిలదీశారు. బాధ్యతారహితంగా విధులు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డిస్టిక్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ రంగారెడ్డి, హెచ్‌ఎం వీరేష్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.