Jul 16,2023 12:31

ఆదోని (కర్నూలు) : ఆదోని పట్టణంలో ప్రమాదకరంగా ఉన్న పాత ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి స్థానంలో కొత్త ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మన్న, కార్యదర్శి వర్గ సభ్యులు గోపాల్‌, తిప్పన్న, ముక్కన్న, పట్టణ నాయకులు వీరేష్‌, నాగేంద్ర, నాగరాజు తెలిపారు. ఆదోని జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 26 నుండి 31వ తేదీ వరకు ఆదోని నుండి కర్నూల్‌ వరకు జరుగు సిపిఎం మహా పాదయాత్ర జయప్రదం చేయాలని, ఆదోని పట్టణంలోని న్యూ గాంధీనగర్‌, క్రాంతి నగర్‌, లేబర్‌ కాలనీ, సి ఆర్‌ నగర్‌, శంకర్‌ నగర్‌, కల్లుబావి, బిసి కాలని, ప్రకాష్‌ నగర్‌, ఏరియాలలో ఆదివారం పాదయాత్ర చేస్తూ కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం నేతలు మాట్లాడుతూ ... పట్టణంలో పురాతనమైన ఫ్లైఓవర్‌ బ్రిడ్జి ప్రమాదం అంచుల్లో ఉందని తెలిపారు. ఇప్పటికే బ్రిడ్జి సైడ్‌ వాల్స్‌, పైకప్పు పెచ్చులు కిందపడి గతంలో ఒకరి ప్రాణాలు పోయాయని గుర్తు చేశారు. బిడ్జ్రి నిర్మాణంపై సిపిఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ, కలెక్టర్‌కి వినతిపత్రం, ఇచ్చిన తర్వాత బ్రిడ్జిపై భారీ వాహనాలు రాకపోకలను నిలిపివేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని తెలిపారు. వార్డులలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యల రోడ్లు డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, కల్లుబావిలో ఉన్న స్మశాన వాటికకు రక్షణ గోడ నిర్మించి వీధిలైట్లు వేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఈరన్న, గౌస్‌, మునెప్ప, రాజు, మనోహర్‌, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.