Sep 03,2023 20:19

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పెట్రోలు, డీజిల్‌ తదితర ఇంధనాలపై ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా పన్నులు వేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలియంపై రెండుసార్లు పన్నులు తగ్గించిందని చెప్పుకొచ్చారు. అయితే రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఊరటనిచ్చేలా చర్యలు చేపట్టలేకపోయిందన్నారు. ప్రజలపై అధిక భారాలు మోపినప్పటికీ రాష్ట్రంలో అభివృద్ది ఎక్కడీ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. కేంద్రం ఇటీవల గ్యాస్‌ ధరలను తగ్గించిందని ఆమె పునరుద్ఘాటించారు.