Mar 17,2023 15:35

పారిస్‌  :   సెనెట్‌ ఆమోదం లేకుండా వివాదాస్పద పెన్షన్‌ సంస్కరణ బిల్లుని కార్మకులపై రుద్దేందుకు  ఫ్రెంచ్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. ఫ్రెంచ్‌ సెనెట్‌ ఓటు లేకుండానే ఈ బిల్లుని బలవంతంగా రాజ్యాంగ సవరణ ద్వారా ఫ్రెంచ్‌ ప్రధాని ఎలిసబెత్‌ బోర్న్‌ గురువారం ఆమోదించారు. మా పెన్షనర్ల భవిష్యత్తును ఇరకాటంలో పెట్టలేమని... అందుకే ఈ సంస్కరణను ప్రవేశపెట్టామని బోర్న్‌ తెలిపారు. ఫ్రెంచ్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 49 (49.3)లోని 3వ పేరాగ్రాఫ్‌ ప్రకారం... ప్రధాని, మంత్రుల మండలితో సంప్రదించిన అనంతరం ఓట్ల ప్రక్రియ లేకుండానే జాతీయ అసెంబ్లీ ఈ బిల్లు ఆమోదించవచ్చునని అన్నారు. బోర్న్‌ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ఫ్రాన్స్‌లోని ప్రధాన కార్మిక సంఘాలు మార్చి 23న 9వ సాధారణ సమీకరణలో పాల్గనాలని కార్మికలకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం ఆర్టికల్‌ 49.3ని వినియోగించడాన్ని వ్యతిరేకిస్తూ పారిస్‌లోని ప్లేస్‌ డి లా కాంకోర్డ్‌ వద్ద సుమారు 6,000 మంది కార్మికులు గురువారం ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శన ఉద్రిక్తతకు దారితీయడంతో 38 మందిని అరెస్ట్‌ చేశారు.