ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్ (బాపట్ల) : వైద్య రంగంలో ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పావులూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో కంటికి సంబంధించిన పరీక్షలు, ఈసీజీ, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి గుండె, కిడ్నీ, విష జ్వరాలు లాంటి వ్యాధులకు వైద్యులు , పేషంట్లకు తగు జాగ్రత్తలు చెప్పారు. ఉచితంగా మందుల పంపిణీ చేశారు. అలాగే రోగ నిర్ధారణ జరిగిన 30మంది పేషంట్లకు ఒంగోలు కిమ్స్ హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ, ఈఎస్‌ఐ, ఈహెచ్‌ఎస్, కార్డుల ద్వారా ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తామని ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తామని.కిమ్స్ హాస్పిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ రఫీ తెలిపారు. ఈ క్యాంపులో డాక్టర్ రామాంజనేయులు, ఆప్తమాలజిస్ట్ రాణి, కిమ్స్ హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు.










