తెలంగాణ : ఈ విద్యా సంవత్సరం తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ప్రతీనెలా నాలుగో శనివారం 'నో బ్యాగ్ డే' ను అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులకు మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు, స్కూలు పిల్లల పుస్తకాల భారాన్ని తగ్గించేందుకు 'నో బ్యాగ్ డే' అనే కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు విద్యాశాఖ తెలిపింది. విద్యార్థులపై ఒత్తిడి, బ్యాగుల భారం తగ్గించడంలో భాగంగా ప్రతి నాలుగో శనివారం నో బ్యాగ్ డేగా అమలు చేస్తామని అధికారులు తెలిపారు.
ప్రతీ నాలుగో శనివారం 28 రకాల కార్యకలాపాలు...
పాఠశాల విద్యా శాఖకు చెందిన స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 1 నుండి 10వ తరగతి విద్యార్థుల కోసం 10 బ్యాగ్‌లెస్ రోజుల కోసం హ్యాండ్‌అవుట్‌తో ముందుకు వచ్చింది. ఇది ప్రతి నాలుగవ శనివారం చేపట్టాల్సిన కార్యక్రమాలను పేర్కొంది. వీటిలో 28 రకాల కార్యకలాపాలు ఉన్నాయి, వాటిని వారి సామర్థ్యాన్ని బట్టి ఉపయోగించుకునే అవకాశం ఇవ్వబడింది.
పలు కార్యకలాపాలు...
ఈ 28 కార్యకలాపాల్లో ... మ్యూజియంలు, చారిత్రక ప్రదేశాలు, గ్రామ పంచాయతీల వంటి కార్యాలయాల సందర్శనలు, సైన్స్ ప్రయోగాలు, డూడ్లింగ్, మోడల్ అసెంబ్లీ, మోడల్ ఎలక్షన్స్ వంటి ఇండోర్ కార్యకలాపాలు, పాఠశాలల్లో వివిధ విషయాలను నేర్చుకోవడం వంటివి ఉంటాయి. దీని ప్రకారం.. ప్రైమరీ విభాగంలో షో టైమ్, ఫన్ స్టేషన్, క్రియేటివ్ సర్కిల్ అనే మూడు సెషన్లు ఉంటాయి. 1వ, 2వ తరగతి విద్యార్ధులు తమ కుటుంబం గురించి మాట్లాడాలని, కుటుంబ సభ్యులలో ఒకరిలా నటించాలని, కమ్యూనికేషన్ స్కిల్స్, సఅజనాత్మకతను పెంపొందించుకునే ఈ సెషన్‌లలో భాగంగా కుటుంబ సభ్యుని స్కెచ్‌ని గీయాలని కోరతారు.
3 నుండి 5 వ తరగతి విద్యార్థులకు కార్యాచరణ...
3 నుండి 5వ తరగతి విద్యార్థులకు కార్యాచరణ ఆధారిత అభ్యాసంలో భాగంగా, జీవనోపాధిపై ఒక థీమ్ అభివఅద్ధి చేయబడింది. ఇక్కడ వారు వఅత్తిలో ఉపయోగించే పనిముట్లను గీయాలని, వారికి నచ్చిన వఅత్తిపై మాట్లాడాలని, పని చేయాలని కోరారు. సెకండరీ స్థాయి 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు, కుటుంబ బడ్జెట్ సర్వేతోపాటు పోస్ట్ ఆఫీస్, నిర్మాణ స్థలాలు, రేషన్ షాపుల సందర్శనలతో సహా ఫీల్డ్ విజిట్‌లు, మోడల్ అసెంబ్లీ, మోడల్ ఎలక్షన్, అవుట్‌డోర్, ఇండోర్ కార్యకలాపాలు ఉన్నాయి. అంతేకాకుండా.. సెకండరీ స్కూల్ స్థాయి విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలు, దాని అప్లికేషన్లు, కెరీర్ అవకాశాలను కూడా పరిచయం చేయనున్నారు.