ప్రజాశక్తి-తెనాలి(గుంటూరు) : పట్టణంలోని వాకర్స్ క్లబ్ తెనాలి-2 వ్యవస్థాపకులు, ఆ సంస్థ గౌరవాధ్యక్షులు వి.డి.ఆర్.మనోహర్(80) శనివారము తుదిశ్వాస విడిచారు. ఆయన గతంలో గుంటూరు జిల్లాపరిషత్ మేనేజరుగా, కర్నూలు జిల్లాపరిషత్ అసిస్టెంట్ సిఈఓగా, ఏలూరు జిల్లాపరిషత్ సిఈఒగా పని చేశారు. ఉద్యోగ విరమణ అనంతరము ఉడా కాలనీలో నివసిస్తూ వాకర్స్ క్లబ్ తెనాలి -2 ప్రారంభించారు. ప్రతినెలా వైద్యులతో ఆరోగ్య సలహాలు, పలు సేవాకార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రతి సంవత్సరము కె.యస్.యమ్. హైస్కూలు, యన్.సి.ఆర్ హైస్కూలులో ప్రతిభగల విద్యార్ధులకు నగదు పారితోషికాలు, పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక సహకారము అందించేవారని వాకర్స్ క్లబ్ సభ్యులు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత వేజళ్ల ఉమామహేశ్వర్ తెలిపారు. ఆయన మృతదేహానికి క్లబ్ సభ్యులు ఆనందరావు, భుజంగరావు,బుచ్చిబాబు, భాస్కరరావు, సూరిబాబు నివాళులర్పించారు .










