Jun 01,2023 16:49

రూ.10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన..
ప్రజాశక్తి...నరసరావుపేట : 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శేషమ్మ చెరువుకు మరమ్మతులు చేపట్టి అభివృద్ధి పనులు చేయడం ద్వారా మండల కేంద్రం రొంపిచర్ల గ్రామ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు గురువారం మండల కేంద్రంలో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా రూ సుమారు 10 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. స్థానిక పడమటి పాలెంలో గల శేషమ్మ చెరువులో రూ 8 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించనున్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు శంకుస్థాపన చేయగా, స్థానిక బొడ్రాయిసెంటర్లో గల శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం ఎదుట రూ 2 కోట్ల నిర్మించనున్న టిటిడి కళ్యాణ మండపం నిర్మాణానికి
భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గ్రామంలో మంచినీటి సౌకర్యం కొరకు నిర్మించిన రెండు రక్షిత మంచినీటి ట్యాంకుల వలన ఉపయోగం లేకుండా పోయిందన్నారు. మంచి నీటి సమస్య పరిష్కారం కొరకు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శేషమ్మ చెరువును బాగుచేయించి సాగర్ కెనాల్ నుండి చెరువులోకి నీరు వచ్చే విధంగా చేయటం జరుగుతుందన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేసి పైప్ లైన్ల ద్వారా గ్రామంలో ఇంటింటికి మంచి నీటి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. దీనికి మొత్తం రూ 7.90 కోట్ల నిధులు కేటాయించామని మొదటి విడత రూ 4.3 కోట్ల రెండవ విడత రూ 3.6 కోట్ల మంజూరు అయ్యాయన్నారు. అదే విధంగా గ్రామంలో రూ 2.2 కోట్లతో నిర్మించనున్న టిటిడి కళ్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ చేశారు. గ్రామంలో గల శ్మశాన వాటికలలో గల సమస్యలను పరిష్కరిస్తానని హమీఇచ్చారు. గ్రామంలో కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన స్థలంలో త్వరలో విద్యాలయం నిర్మాణ పనులు ప్రారంభమవుతాయన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పిల్లి ఓబుల్ రెడ్డి, వైసిపి మండల కన్వీనర్ పచ్చవ రవీంద్రబాబు, గ్రామ మాజీ సర్పంచ్ పడాల చక్రారెడ్డి, ఎంపిపి గడ్డం వెంకట్రావు, తహశీల్దార్ జి.అంకారావు,ఎండిఓ కె.మ్యాథ్యూబాబు,విఆర్ఓ పడాల సుబ్బారెడ్డి, వైసిపి మండల నాయకులు చపారపు సంజీవరెడ్డి,కల్లి పిచ్చిరెడ్డి, మానుకొండ వాసుదేవరెడ్డి, పడాల రమణారెడ్డి, కల్లి సుబ్బారెడ్డి, వెంకటరెడ్డి, వివిధ శాఖల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.