Apr 22,2023 21:25

న్యూఢిల్లీ : జీవిత బీమా కంపెనీల్లో ఒక్కటైన టాటా ఎఐఎ లైప్‌ ఇన్సూరెన్స్‌ కొత్తగా ఫార్చ్యూన్‌ గ్యారెంటీ పెన్షన్‌ను విడుదల చేసింది. ఈ యాన్యుటీ (గ్యారెంటీడ్‌ ఇన్‌కమ్‌ ఫర్‌ లైఫ్‌) ప్లాన్‌లో అత్యధిక యాన్యుటీ రేట్లు, మరణ ప్రయోజనాలు ఉండటంతో వినియోగదారులు తమ గోల్డెన్‌ ఇయర్స్‌లో ఆర్ధికంగా స్వేచ్ఛను పొందగలరని ఆ సంస్థ పేర్కొంది. ''వినియోగదారులు ఖచ్చితంగా తమ రిటైర్‌మెంట్‌ తరువాత ఆర్థిక స్వేచ్ఛకు భరోసా కలిగి ఉండాలి. భవిష్యత్‌ కోసం ప్రణాళికలు చేసుకునే వివాహితులు, మహిళలు, వ్యక్తులతో పాటుగా ఎస్‌ఎంఇ వినియోగదారులకు ఈ ప్లాన్‌ అత్యంత అనుకూలంగా ఉంటుంది.'' అని టాటా ఎఐఎ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ సమిత్‌ ఉపాధ్యారు పేర్కొన్నారు.