Apr 05,2023 21:46

న్యూఢిల్లీ : అమూల్‌ మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌ఎస్‌ సోది తాజాగా రిలయన్స్‌ ఇండిస్టీస్‌లో చేరారు. పాలు, పాల ఉత్పత్తుల విశేష అనుభవం కలిగిన సోధి రిలయన్స్‌ రిటైల్‌ విభాగానికి పని చేయనున్నారని తెలుస్తోంది. కాగా.. దీనిపై రిలయన్స్‌, సోది ఇరువురు స్పందించలేదు. అమూల్‌కు చెందిన మాతృసంస్థ గుజరాత్‌ కోపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జిసిఎంఎంఎఫ్‌) ఎండిగా పని చేసిన ఆర్‌ఎస్‌ సోదిని గడిచిన జనవరిలో ఆ సంస్థ అనుహ్యాంగా తొలగించింది. 2010 నుంచి అమూల్‌ బాధ్యతలను చూశారు.