ప్రపంచ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టార్ బ్రేవ్ వయెట్ (36) కన్నుమూశారు. వ్యాట్.. గురువారం గుండెపోటుతో మరణించారు. మాజీ ఛాంపియన్ బ్రే వ్యాట్ గుండెపోటుతో కన్నుమూసినట్లు WWE చీఫ్ కంటెంట్ ఆఫీసర్ పాల్ ‘ట్రిపుల్ హెచ్’ లెవెస్కీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. విషయం తెలిసిన WWE అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
బ్రేవ్ వయెట్ మూడుసార్లు WWE ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. ఇందులో WWE ఛాంపియన్‌షిప్‌ను ఒకసారి, రెండుసార్లు యూనివర్సల్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బ్రే వ్యాట్.. డబ్ల్యూడబ్ల్యూఈ పోటీలకు దూరంగా ఉంటున్నాడు. బహిర్గతం చేయలేని ఆరోగ్య సమస్యతో అతడు బాధపడుతున్నాడని సమాచారం. బ్రే వ్యాట్ తండ్రి హాల్ ఆఫ్ ఫేమర్ మైక్ రొటుండా, తాత బ్లాక్‌జాక్ ముల్లిగన్ కూడా ఫ్రొఫెషనల్ రెజ్లర్ కావడం విశేషం. వ్యాట్ కుటుంబంలో మరికొందరు రెజ్లర్లు కూడా ఉన్నారు. అతడి మేనమామలు బారీ, కెండల్ విండ్‌హామ్ కూడా రెజ్లింగ్ ప్రపంచంలో కెరీర్‌ను కొనసాగించారు.










