May 13,2023 12:17

ప్రజాశక్తి-ఉంగుటూరు (ఏలూరు) : నారాయణపురం పంచాయతీ మాజీ సర్పంచ్‌ పెద్దిరెడ్డి గణేశ్వరరావు శనివారం గుండెపోటుతో మృతి చెందారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, ఐస్‌ ఫ్యాక్టరీ యజమానులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన హయాంలో నారాయణపురంలో ఇందిరమ్మ కాలనీ వైఎస్‌ఆర్‌ కాలని 16 ఎకరాల విస్తీర్ణంలో 672 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి జిల్లాలో అత్యంత వేగంగా అభివృద్ధి అయిన కాలనీగా పేరు సాధించడంలో గణేశ్వరరావు కృషి ఉందని కాలనీ వాసులు తెలిపారు.