Feb 27,2023 15:25

హైదరాబాద్‌ : ఉమ్మడి ఏపీలో పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ధర్మపురి శ్రీనివాస్‌ అస్వస్థతకు గురయ్యారు. బంజారాహిల్స్‌లోని సిటీన్యూరో ఆసుపత్రిలో ఆయనను కుటుంబసభ్యులు చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. వైద్య పరీక్షల అనంతరం డీఎస్‌ ఆరోగ్యపరిస్థితిని వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు. తండ్రి అస్వస్థతకు గురి కావడంతో ఆయన కుమారుడు, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నీ కార్యక్రమాలను రద్దు చేసుకొని.. హుటాహుటిన ఆస్పత్రికి బయలుదేరారు. 'మా నాన్న డి. శ్రీనివాస్‌ గారు తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు, రేపు (27,28) రెండు రోజుల పాటు నా కార్యక్రమాలన్ని రద్దు చేసుకుంటున్నాను.' అని ఎంపీ అర్వింద్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.