Nov 22,2022 12:23

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : కశింకోట మండలంలోని తాళ్ళపాలెం గ్రామ పంచాయతి కార్యాలయం వద్ద మాజీ మంత్రి గుడివాడ గురునాథ్‌ రావు 21 వ వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గురునాథ్‌ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి అలంకరించి ఘన నివాళులర్పించారు. గురునాథ్‌ రావు అమర్‌ రహే అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్‌ సభ్యుడు అద్దంకి సతీష్‌, మాజీ సర్పంచ్‌ చిన్ని వల్లభ నారాయణరావు, ఇందల ముసలినాయుడు, పదవీ విరమణ ఉద్యోగి చిన్ని సన్యాసి నాయుడు, పొలిమేర శెట్టి జోషెప్‌, వార్డు సభ్యులు, కొన తాతీలు చిన్ని రాజీవ్‌, ,చిన్ని బాబురావు, దేసెట్టి నాగేశ్వరరావు, ఈశ్వర రావు పాల్గొన్నారు.