Jun 10,2023 07:47

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు వయసుకు తగగ్టఉ్టగా ఎదగటం లేదని బాధపడుతూ ఉంటారు. అటువంటి పిల్లలకు ఇచ్చే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎత్తు పెరిగేలా సహాయపడే కొన్ని ఆహార పదార్థాలను రోజూవారిగా తినిపించాలి.
ొ సాధారణంగా ఎత్తు పెరగడానికి క్యాల్షియం అవసరమవుతుంది. కాల్షియం సోయా ప్రొడక్ట్స్‌లో బాగా దొరుకుతుంది. సోయాబీన్స్‌, సోయా మిల్క్‌ను రెగ్యులర్‌గా డైట్‌లో భాగంగా చేసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
పాలలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. రోజూ గ్లాసు పాలు పిల్లలకు ఇస్తూ ఉండాలి. ఎత్తు పెరగడానికి సహాయపడే కొన్ని ప్రొటీన్స్‌, కార్బోహైడ్రేట్లు పాలు, మాంసంలో దొరుకుతాయి. ఎముకలు గట్టిపడి ఎదుగుదలకు సహాయపడతాయి. కండరాలు పెరుగుదలకు బాగా ఉపయోగపడతాయి.

  • బెండకాయలో విటమిన్లు, ఫైబర్‌, ఖనిజాలు ఉంటాయి. ఇందులో ఉన్న ప్రోటీన్‌, క్యాల్షియంతో పాటుగా విటమిన్‌ ఏ, బి, డి, ఇ లు కూడా ఎదుగుదలకుదోహదపడతాయి.
  • ఆకుకూరల్లో క్యాల్షియం, ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. బచ్చలి కూరలో ఐరన్‌, కాల్షియం, ఫైబర్‌, అధికంగా ఉంటాయి.