
72ఏళ్ల ఆసియా క్రీడల చరిత్రలో భారత బృందం తొలిసారి అత్యధిక పతకాలను సాధించింది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరిగిన 19వ ఆసియా క్రీడల్లో భారత్ 107 పతకాలతో సత్తా చాటింది. ఇందులో 28స్వర్ణ, 38రజత, 41 కాంస్య పతకాలతో 4వ స్థానానికి ఎగబాకింది. తొలి మూడు స్థానాల్లో చైనా, జపాన్, కొరియా ఉన్నాయి. 100 పతకాలే లక్ష్యంగా ఈసారి క్రీడల బరిలోకి దిగిన భారత్.. ఆ ఫీట్‌ను అందుకోవడానికి క్రీడల ప్రారంభం పోటీపడింది. 2018, 2014 ఆసియా క్రీడల్లో 70పతకాలతో 8వ స్థానానికే పరిమితమైన భారత్.. ఈసారి నాలుగు స్థానాలు మెరుగుపరుచుకోవడంతోపాటు 37 పతకాలను అధికంగానూ సాధించింది. అలాగే 655మందితో భారీ బృందం చైనాకు పయనం కాగా.. అథ్లెటిక్ విభాగంలోని 22కేటగిరీల్లో ఈసారి అత్యధికంగా 29 పతకాలు దక్కాయి. షూటింగ్(22), ఆర్చరీ(9) విభాగాల్లో భారత్‌కు టాప్-3లో పతకాలు దక్కాయి. షూటింగ్‌లో దక్కిన పతకాల్లో ఏకంగా 7 స్వర్ణాలు ఉండగా.. అథ్లెటిక్స్ విభాగంలో ఆ తర్వాత 6 స్వర్ణాలు వచ్చాయి. ఆర్చరీలోనూ వచ్చిన 9 పతకాల్లో 6 స్వర్ణాలున్నాయి. క్రికెట్, కబడ్డీలో రెండు విభాగాల (పురుషుల, మహిళల) జట్లు బంగారు పతకాలను సాధించగా.. హాకీలో పురుషుల జట్టు పసిడిని ముద్దాడితే.. మహిళల జట్టు తొలిసారి కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది. స్క్వాష్‌లోనూ ఈసారి ఎన్నడూ రాణి విధంగా అత్యధిక పతకాలు దక్కాయి. ఇందులో రెండు స్వర్ణాలు ఉన్నాయి. బ్యాడ్మింటన్, టెన్నిస్, ఈక్వెస్టియన్‌లో తొలిసారి బంగారు పతకాలు భారత్‌కు దక్కాయి.
ఇదే ప్రదర్శనను 2024 పారిస్ ఒలింపిక్స్‌లోనూ మన అథ్లెట్లు చూపితే భారత్‌కు మరిన్ని పతకాలు దక్కడం ఖాయం. ఇక అథ్లెట్లను క్రీడలకు సన్నద్ధతకు కల్పించే సౌకర్యాల్లోనూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. 19వ ఆసియా క్రీడల నిర్వహణను చైనా ఛాలెంజ్‌గా తీసుకొంని సమర్ధవంతం నిర్వహించింది. ఆసియా క్రీడలు జరిగిన హాంగ్జౌ నగరంలో ఆ 15రోజులు ఎలాంటి అంవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వాహకులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. క్రీడల్లో పాల్గొని తిరిగి వెళ్లేటప్పుడు అధికారులు, అథ్లెట్లు, పర్యాటకులు మాట్లాడుతూ.. వసతి, భోజన, ప్రయాణ సౌకర్యాలన్నీ 'పర్ఫెక్ట్‌లీ ఓకే' అని పేర్కొనడం విశేషం.
భారత్ సాధించిన పతకాలు(స్వర్ణ, రజత, కాంస్యాలు)
1. అథ్లెటిక్స్ : 29 (6, 14, 9)
2. షూటింగ్ : 22 (7, 9, 6)
3. ఆర్చరీ : 9 (5, 2, 2)
4. రెజ్లింగ్ : 6 (0, 1, 5)
5. స్క్వాష్ : 5 (2, 1, 2)
6. రోయింగ్ : 5 (0, 2, 3)
7. బాక్సింగ్ : 5 (0, 1, 4)
8. క్రికెట్ : 2(స్వర్ణాలు)
9. కబడ్డీ : 2(స్వర్ణాలు)
10. బ్యాడ్మింటన్: 3 (1, 1, 1)
11. టెన్నిస్ : 2 (1, 1, 0)
12. ఈక్వెస్టియన్: 2 (1,0, 1)
13. హాకీ : 2 (1, 0, 1)
14. ఛెస్ : 2(రజతం)
15. పాడ్లె : 3 (0, 1, 2)
16. స్కేటింగ్ : 2(కాంస్యం)
17. బ్రిడ్జ్ : 1(రజతం)
18. గోల్ఫ్ : 1(రజతం)
19. వుషూ : 1(రజతం)
20. కనోయింగ్: 1(కాంస్యం)
21. సెపక్‌తక్రా : 1(కాంస్యం),
22. టేబుల్ టెన్నిస్: 1(కాంస్యం)