May 13,2023 11:00
  • నాడు ప్రశంసలు.. నేడు మాటే కరువు...

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అంతర్జాతీయ వేదికలపై పోరాడి భారత్‌కు ఒలింపిక్స్‌సహా అనేక పతకాలు తెచ్చిన క్రీడాకారులు న్యాయం కోసం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌లో 21రోజులుగా పోరాడుతున్నారు. పద్మశ్రీ, అర్జున, మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న, రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న తదితర అవార్డులను అందుకుని.. క్రీడాలోకానికే వన్నెతెచ్చిన రెజ్లర్లు న్యాయం చేయాలని కోరుతున్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ)చీఫ్‌, బిజెపి ఎంపి బ్రిజ్‌ భూషణ్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. అందు కోసం... ధర్నా శిబిరం వద్ద టెంట్‌లోనే రాత్రింబవళ్లు పోరాడు తున్నారు. జోరు వాన కురిసి వారు విశ్రాంతి తీసుకునే పరిస్థితి కూడా లేకపోవడంతో ఫోల్డింగ్‌ మంచాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా.. దాన్ని సైతం ఢిల్లీ పోలీసులు ఇటీవల అడ్డుకున్నారు. పలువురిని చితకబాదారు. కొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునే ఢిల్లీ పోలీసులు... కేంద్ర ప్రభుత్వం బ్రిజ్‌భూషణ్‌కు కొమ్ముకాస్తున్న వైఖరి ప్రతినిత్యం కనిపిస్తోంది. 'బేఠీ బచావో' నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేసిన మోడీ సర్కారు ఆ బేఠీలు నడిరోడ్డుపై చేస్తున్న ఆందోళనను పట్టించుకోకపోవడం ప్రపంచవ్యాప్తంగా ప్రశ్నార్థకమవు తున్నా... ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షా... ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చర్చనీయాంశమవుతోంది. పతకాల కోసం రెజ్లింగ్‌ బరిలో దిగాల్సిన తాము ఆడబిడ్డల పరువు కోసం దేశ రాజ ధానిలో పోరాడుతున్నామని చెబుతున్న ఈ రెజ్లర్లం దరూ గ్రామీణ ప్రాంతాలనుంచి ప్రపంచస్థాయికి ఎదిగినవారే. వారుసాధించిన పతకాలు, పొందిన అవార్డుల సమాచారం సంక్షిప్తంగా...

బజరంగ్‌ పునియా : హర్యానాలోని ఝజ్జర్‌ ప్రాంతానికి చెందిన చెందిన పునియా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు పత కాలు సాధించిన ఏకైక భారతీయ రెజ్లర్‌గా నిలిచాడు. రెజ్లర్‌ అయిన తండ్రి ప్రోత్సాహంతో స్థానిక మట్టి కుస్తీ పాఠశాలలో చేరాడు. కోచ్‌ రాంఫాల్‌ మాన్‌ శిక్షణలో ఎదిగాడు. ఇండియన్‌ రైల్వేలో గెజిటెడ్‌ ఆఫీ సర్‌ ఒఎస్‌డి స్పోర్ట్స్‌ పోస్ట్‌లో పనిచేస్తున్నారు. ఆయన భార్య సంగీత.

సాధించిన పతకాలు : 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం ర ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 2018లో రజతం, 2013, 2019లో కాంస్య పతకాలు రఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో 2017లో స్వర్ణం, 2014, 2021లో రజతం, 2013లో కాంస్యం ర ఆసియా క్రీడల్లో 2018లో స్వర్ణం, 2014లో రజతం రకామన్వెల్త్‌ గేమ్స్‌లో 2018, 2022లో స్వర్ణం, 2014లో రజతం ర2021లో రోమ్‌లో మాటియో పెల్లికాన్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌లో స్వర్ణం

అవార్డులు : 2015లో అర్జున, 2019లో పద్మశ్రీ, రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న, 2020లో ఎఫ్‌ఐసిసిఐ ఇండియా స్పోర్ట్స్‌ అవార్డ్‌.
నగదు పురస్కారాలు : 2020 టోక్యో సమ్మర్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నందుకు కేంద్ర ప్రభుత్వం నుండి రూ.30 లక్షలు, హర్యానా ప్రభుత్వంనుండి రూ.2.5 కోట్లు బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా నుండి రూ.25 లక్షలు
ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ నుండి రూ.25 లక్షలు
పెదనాన్న శిక్షణలో అంతర్జాతీయ స్థాయికి వినేష్‌ ఫోగాట్‌
వినేష్‌ ఫోగాట్‌ 1994 ఆగస్టు 25న హర్యానాలో చర్కీ దాద్రీ జన్మించారు. రెజ్లర్‌ అయిన తండ్రి రాజ్‌పాల్‌ చిన్నతనంలోనే మరణించారు. వినేష్‌, ఆమె సోదరి ప్రియాంక పెదనాన్న, ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహావీర్‌ సింగ్‌ ఫోగాట్‌ వద్దే పెరిగారు. వినేష్‌ కజిన్స్‌ (గీత, బబిత, రీతు, సంగీత) అంతర్జాతీయ రెజ్లర్లు, కామన్వెల్త్‌ గేమ్స్‌ పతక విజేతలు. కామన్వెల్త్‌, ఆసియా క్రీడలు రెండింటిలోనూ స్వర్ణం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా వినేష్‌ నిలిచారు. ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో అత్యధిక పతకాలు గెలుచుకున్న ఏకైక భారతీయ మహిళా రెజ్లర్‌ ఆమె. 2018 డిసెంబర్‌ 13న వినేష్‌ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు సాధించారు. ఆమె భర్త, రెజ్లర్‌ సోమ్‌వీర్‌ రాతీ.

పతకాలు : టోక్యో ఒలింపిక్స్‌ 2020కి అర్హత సాధించిన తొలి భారతీయ రెజ్లర్‌ర2019, 2022లో ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపి యన్‌ షిప్‌లో కాంస్యం ర ఆసియా ఛాంపియన్‌షిప్‌లో 2018లో స్వర్ణం, 2015లో రజతం, 2014లో కాంస్యం ర2013, 2019లో ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు ర2014, 2018, 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు ర2013లో కామన్వెల్త్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం రరోమ్‌లో జరిగిన మాటియో పెల్లికోన్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌లో స్వర్ణం ర2019లో యాసర్‌ డోగు ఇంటర్నేషనల్‌లో స్వర్ణం ర2019లో వార్సాలో పోలాండ్‌ ఓపెన్‌ రెజ్లింగ్‌ టోర్నమెంట్‌లో స్వర్ణం ర2020లో రోమ్‌ ర్యాంకింగ్‌ సిరీస్‌లో స్వర్ణం ర2021లో కీవ్‌లో జరిగిన టోర్నమెంట్‌. మాటియో పెల్లికాన్‌ ర్యాంకింగ్‌ రసిరీస్‌లలో వరుసగా రెండు స్వర్ణాలు, 2021లో పోలాండ్‌ ఓపెన్‌లో స్వర్ణం అవార్డులు: 2020లో మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న అవార్డు. ్య 2016లో అర్జున అవార్డు ్య 2022లో బిబిసి ఇండియన్‌ స్పోర్ట్స్‌ ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ్య 2019లో లారెస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ అవార్డ్స్‌కు నామినేట్‌ అయిన తొలి ఇండియన్‌ అథ్లెట్‌.
 

                                                            తండ్రి శిక్షణతో బరిలో దిగిన సంగీతా ఫోగాట్‌

సంగీత ఫోగాట్‌ 1998 మార్చి 5న రెజ్లింగ్‌ మాస్ట్రో, ద్రోణాచార్య అవార్డు గ్రహీత, మహావీర్‌ సింగ్‌ ఫోగట్‌, దయా శోభా కౌర్‌లకు హర్యానాలోని బలాలీలో జన్మించారు. ఆమెకు ముగ్గురు అక్కలు (గీత, బబిత, రీతు), ఒక తమ్ముడు దుష్యంత్‌ ఉన్నారు. చిన్నాన్న కుమార్తెలు వినేష్‌, ప్రియాంక. మగ వారికే కుస్తీ అని అనుకుంటున్న ఆ రోజుల్లో అందరినీ ఎదిరించి తన, సోదరుడి కుమార్తెలు మొత్తం ఆరుగురికి మహావీర్‌సింగ్‌ తన స్వగ్రామమైన బలాలీలో రెజ్లింగ్‌లో శిక్షణ ఇచ్చారు. సంగీత భర్త బజరంగ్‌ పునియా.

సాధించిన పతకాలు : జాతీయ ఛాంపియన్‌షిప్‌లో రజతం ర2018 కామ న్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్యం ర2017 నేషనల్‌ రెజ్లింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో స్వర్ణం ర2013 జూనియర్‌ ఆసియా ఛాంపి యన్‌షిప్‌లో రజతం అవార్డులు : 2021లో అర్జున అవార్డు.
 

                                                తాతయ్య ప్రేరణతో పతకాల పంట పండించిన సాక్షి మాలిక్‌

సాక్షి మాలిక్‌ 1992 సెప్టెంబర్‌ 3న హర్యానాలోని రోహ్తక్‌ జిల్లాలోని మోఖ్రా గ్రామంలో జన్మించారు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌లో బస్‌ కండక్టర్‌ సుఖ్‌బీర్‌, స్థానిక ఆరోగ్య క్లినిక్‌లో సూపర్‌వైజర్‌ సుదేష్‌ మాలిక్‌ దంపతులకు జన్మించారు. మల్లయోధుడైన తన తాత బద్లు రామ్‌ ప్రేరణగా రెజ్లింగ్‌లో అడుగుపెట్టారు. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె భర్త అంతర్జాతీయ స్థాయి రెజ్లర్‌ సత్యవర్త్‌ కడియన్‌.

పతకాలు : 2012 ఆసియా జూనియర్‌ ఛాంపియన్‌ షిప్‌లో స్వర్ణం, 2009లో కాంస్యం, 2010లో ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌ లో రజతం 2016లో రియో డిజనీరోలో జరిగిన ఒలింపిక్‌ క్రీడల్లో కాంస్యం రకామన్వెల్త్‌ ఛాంపియన్‌షిప్‌లో 2017లో స్వర్ణం, 2013లో రజతం ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 2017లో రజతం, 2015, 2018, 2019లో కాంస్యం కామన్వెల్త్‌ గేమ్స్‌లో 2022లో స్వర్ణం, 2014లో రజతం, 2018లో కాంస్యం : 2014లో డేవ్‌ షుల్ట్జ్‌ ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్‌లో స్వర్ణం
అవార్డులు : 2017లో పద్మశ్రీ, 2016లో మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న
నగదు పురస్కారాలు : ఇండియన్‌ రైల్వే, ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, ఢిల్లీ ప్రభుత్వం, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.5.7 కోట్ల కంటే ఎక్కువ నగదు బహుమతులు పొందారు. హర్యానా ప్రభుత్వం క్లాస్‌ 2 జాబ్‌ ఆఫర్‌ చేసింది. 500 చదరపు గజాల భూమి ఇచ్చింది.