May 29,2023 14:24

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : కాలుష్య నియంత్రణకు నగర ప్రజలంతా సహకరించాలని మేయర్‌ గొలగాని హరి వెంకట కుమరి, జీవీఎంసీ కమిషనర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ విజ్ఞప్తి చేశారు. వారానికొక్కరోజ్కెనా ప్రజలంతా తమ సొంత వాహనాలు వదిలి ప్రజా రావాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని కోరారు. జీవీఎంసీ అధికారులు, ఉద్యోగులు ప్రతి సోమవారం 'నో వెహికల్‌ జోన్‌' పాటిస్తున్నట్టు గుర్తు చేశారు. మేయర్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి బస్టాపు వరకు నడుచుకుంటూ వచ్చి అక్కడి నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు సోమవారం ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అనంతరం 'స్పందన'లో పాల్గొని ఆ తర్వాత ఇంటికి కూడా బస్సులోనే వెళ్లారు. అదే విధంగా కమిషనర్‌ కూడా తన బంగ్లా నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు నడుచుకుంటూ వెళ్లడం ఆందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది.