వేసవిలో రాత్రులు నిద్ర పోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక వైపు వేడి, మరోవైపు ఉక్కపోతకు నిద్రకు పట్టదు. వేసవిలో పగటి సమయం ఎక్కువగా ఉండడం వల్ల మెలటోనిన్ ఉత్పత్తిలో తేడాలు ఏర్పడుతాయని అందువల్ల నిద్ర పోవడం కష్టంగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడతున్నారు.
నిద్రలేమి కారణంగా అనారోగ్యాలు ఎదురయ్యే అవకాశం ఉంది. నిద్రలేమితో బాధపడే వాళ్లలో ఆత్మవిశ్వాసం డిప్రెషన్, ఆందోళన, కోపం, అతిగా తినడం, గందరగోళం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు ఎదురౌతాయి. ఈ సమస్యలేవీ రాకుండా వేసవి వేడి రాత్రుల్లో మంచి నిద్రకు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు స్లీప్ ఎక్స్ పర్ట్స్.
వదులుగా ఉండే దుస్తులు
ఫైబర్, పత్తి, యూకలిప్టస్ లేదా జూట్ వంటి సహజమైన ఫైబర్లు వాడి తయారు చేసిన వదులైన దుస్తులు ధరించాలి.
ఏం తినాలి ?
కారం లేదా కొవ్వులు అధికంగా ఉండే పదార్థాలు రాత్రుళ్లు తీసుకోకూడదు. సోయా సాస్, టోఫు వంటి ఫర్మెంటెడ్ పదార్ధాలు, సిట్రస్ పండ్లలో కూడా టైరమైన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది బ్రెయిన్ యాక్టివిటిని పెంచుతుంది. కాబట్టి ఈ పదార్థాలు కూడా రాత్రి ఆహారంలో తినకూడదు.
ఎలాంటి బెడ్ ?
కాటన్, లెనెన్, సిల్క్ లేదా జూట్ వంటి తేలిక పాటి సహజమైన ఫైబర్లతో తయారు చేసిన పరుపులను ఉపయోగించాలి. లేత రంగుల్లో, తేలికైన బెడ్‌షీట్స్ వాడడం మంచిది.
రాత్రి స్నానం
సాధారణంగానే ప్రతిరోజూ రాత్రి పూట కచ్చితంగా స్నానం చెయ్యాలి. ఈ వేసవిలో తూ.చ తప్పకుండా పాటించాలి. పడుకోవడానికి 1-2 గంటల ముందు స్నానం చెయ్యడం వల్ల మంచి నిద్ర పడుతుంది.
మరి కొన్ని చిట్కాలు
- రాత్రి పూట తేలికైన ఆహారం తీసుకోవాలి.
- సాయంత్రం పూట వ్యాయామం చెయ్యకూడదు.
- మధ్యాహ్నాలు చాలా వేడిగా ఉంటుంది కనుక బెడ్ రూం తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. ఇలా చెయ్యడం వల్ల గది ఎక్కువ వేడిగా ఉండదు.
- సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తలుపులు తెరచి చల్లని గాలి ఇంట్లోకి వచ్చేలా చూడాలి.
- నేల మీద పడుకోవడం మంచి ఆప్షన్. అలవాటు లేని వారు స్ప్రింగ్ పరుపులు వాడుకోవడం మంచిది.










