Apr 26,2023 20:38

కలబురగి : సీజనల్‌ ఉత్పత్తుల సరఫరాలోని సమస్యల వల్లే ద్రవ్యోల్బణం పెరుగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. వీటి పరిష్కారానికి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. నిత్యావసర వస్తువుల ధరల తగ్గుదలపై దృష్టి సారిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. గ్లోబల్‌ మార్కెట్‌లో ఇంధనం, గ్యాస్‌ ధరలు అధికంగా ఉన్నాయన్నారు. గ్యాస్‌, ఇంధన ధరలను తాము అర్థం చేసుకుంటున్నామని.. కానీ ఇవి దిగుమతుల ధరలపై ఆధారపడి ఉంటాయన్నారు.