- వరద పరిస్థితిని సమీక్షించిన రాష్ట్ర మంత్రి వేణు
ప్రజాశక్తి రామచంద్రపురం( కోనసీమ) : గోదావరి వరద నీటి ప్రవాహం శుక్రవారం రాత్రి నుండి మళ్లీ పెరగడంతో కే.గంగవరం మండలంలోని కోటిపల్లి గోదావరి వద్ద మత్స్యకార కాలనీలోనికి వరద నీరు ప్రవేశించింది. వరద నీటి పరిస్థితిని సమీక్షించేందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శనివారం కోటిపల్లిలో పర్యటించారు. మత్స్యకార కాలనీలో ప్రవేశించిన వరద నీరు అదే విధంగా వరదల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక మెడికల్ క్యాంపును ఆయన పరిశీలించారు. గోదావరిలో వరద నీరు పెరుగుతున్న దృశ్య అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. అదేవిధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్‌లకు ఆదేశాలు ఇచ్చారు. ఆయన వెంట వైసీపీ నాయకులు రేవు శ్రీను, డీసీఎంఎస్ డైరెక్టర్ పెట్టా శ్రీనివాస్, శివల గ్రామ సర్పంచ్ అనసూరి సాయిబాబు, తామరపల్లి సర్పంచ్ తోకల శ్రీనివాస్, పెమ్మాడి సత్తిబాబు, కే గంగవరం తహశీల్దార్ వైద్యనాథ్ శర్మ, వీఆర్వో కృష్ణ సాయి తదితరులు ఉన్నారు.











