నందిగామ: హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం తగ్గింది. మున్నేరు వాగు ఉద్ధఅతితో ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద గురువారం సాయంత్రం 4గంటల నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. శుక్రవారం సాయంత్రానికి వరద తగ్గుముఖం పట్టడంతో ఐతవరం వద్ద జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అనుమతించారు. మొదట హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను అనుమతించారు. పోలీసులు దగ్గరుండి ఒక్కో వాహనాన్ని పంపిస్తున్నారు. 26 గంటల తర్వాత ఐతవరం వద్ద రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.