Oct 25,2023 10:35

తైపే : రక్షణ మంత్రి జనరల్‌ లీ షాంగ్ఫూను చైనా తొలగించింది. ఈ మేరకు ప్రభుత్వ రంగ సిసిటివి పేర్కొన్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దాదాపు రెండు నెలల నుండి షాంగ్ఫూ ప్రజాబాహుళ్యంలో కనిపించడం లేదని, అందువల్లే ఆయనను తొలగించినట్లు తెలుస్తోందని మీడియా పేర్కొంది. ఈ ఏడాదిలో ప్రజాబాహుళ్యంలో కనిపించని కారణంలో విధుల నుంచి తొలగింపునకు గురైన రెండో సీనియర్‌ చైనా అధికారి లీ. అంతకుముందు మాజీ విదేశాంగ మంత్రి కిన్‌ గాంగ్‌ కూడా ఇలాగే తొలగింపునకు గురయ్యారు. గత మార్చిలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా లీని రక్షణ మంత్రిగా తీసుకున్నారు. ఆగస్టు 29న ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన అనంతరం ఆయన బహిరంగంగా కనిపించలేదు.