Jul 14,2023 10:21

న్యూఢిల్లీ : బహిరంగ మార్కెట్‌ విక్రయ పథకం (ఇంటి అవసరాల కోసం) విక్రయించే బియ్యం, గోధుముల ధరలను భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) స్వల్పంగా తగ్గించింది. ఈ పథకం కింద సరఫరా చేసే బియ్యం ధర ప్రస్తుతం కిలో రూ.34 ఉండగా దానిని రూ.31కి, గోధుముల ధర కిలో రూ.22.50 ఉండగా దానిని రూ.21.50కు తగ్గించినట్లు ఎఫ్‌సిఐ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ మంజీవ్‌ కుమార్‌ గోయల్‌ గురువారం తెలిపారు. ఇంటి అవసరాల కోసం వినియోగదారులకు అమ్మకాలు సాగిస్తూ ఎఫ్‌సిఐ వద్ద రిజిష్టర్‌ చేసుకున్న బల్క్‌ వ్యాపారులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.