ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ మే 5 మధ్యాహ్నం 12 గంటల నుంచి మే 10 వరకు ఆరు రోజులపాటు కొనసాగనుంది. ఇందులో ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌షిప్ యూజర్లు ముందుగానే పాల్గనే అవకాశం ఉంటుందా? లేదా? అనేది తెలియాల్సివుంది. ఈ సేల్‌లో కొన్ని మొబైల్ మోడల్స్‌పై భారీగా ఆఫర్లు ప్రకటించారు. ఈ జాబితాలో యాపిల్ ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈ 5జీ, గూగుల్ పిక్సెల్ 6ఏ వంటి
ప్రీమియం ఫోన్లు కూడా ఉన్నాయి.
గూగుల్ పిక్సెల్ ఫోన్‌లపై కూడా ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు ప్రకటించింది. గూగుల్ పిక్సెల్ 6ఏ ధర ? 43,999 కాగా.. ఈ సేల్‌లో ? 25,999కే లభిస్తుంది. ఇక, పిక్సెల్ 7 మోడల్ ధర ? 59,999 ఉండగా.. ? 44,999కే కొనుగోలు చేయొచ్చు. వీటితోపాటు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్3, శాంసంగ్ ఎస్21 ఎఫ్‌ఈ 5జీ, ఐఫోన్ 13 మోడళ్లపై కూడా భారీ డిస్కౌంట్ ఉండబోతోందని కంపెనీ పేర్కొంది. డిస్కౌంట్ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. మే 1 నుంచి కర్టైన్ రైజర్ డీల్స్ పేరుతో వేటిపై ఎంత ఆఫర్లు ఉంటాయనే వివరాలను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించనుంది. అయితే ఈ సేల్‌లో టీవీ, హౌమ్ అఫ్లియెన్సెస్‌పై 70 శాతం వరకు.. ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్లు, ఐప్యాడ్లు, ప్రింటర్లు వంటి వాటిపై దాదాపు 80 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని సమాచారం.
ఆఫర్లు వీటిపైనే
ఈ సేల్‌లో బడ్జెట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించారు. పోకో సీ55 ధర ? 11,999 కాగా.. ఈ సేల్‌లో ? 7,999కే విక్రయించనున్నారు. అలాగే ఇన్ఫీనిక్స్ హాట్ 20 5జీ ఫోన్ ధర ? 17,999 కాగా.. ? 9,999కే కొనుగోలు చేయొచ్చు. ? 10,999 ధర కలిగిన మోటో ఈ13 ఫోన్‌ను ఈ సేల్‌లో ? 7,499కే విక్రయించనున్నారు. రెడ్‌మీ నోట్ 12 ప్రో 5జీ మోడల్ ధర ? 29,999 కాగా.. ? 21,749కే కొనుగోలు చేయొచ్చు. రియల్‌మీ10ప్రోం 5జీ ధర ? 25,999 కాగా.. ఈ సేల్‌లో ? 22,999కే విక్రయించనున్నారు. అలానే, పోకో ఎక్స్ 5 ప్రో 5జీ ఫోన్ ధర ? 25,999 కాగా.. ? 20,999కే కొనుగోలు చేయొచ్చు.










