Nov 11,2023 21:23

న్యూఢిల్లీ : అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోసే అవకాశాలున్నాయని అమెరికన్‌ రేటింగ్‌ సంస్థ హెచ్చరించింది. అధిక ద్రవ్యోల్బణంతో 2024లో గ్లోబల్‌ జిడిపి 0.4 శాతం, 2025లో 0.1 శాతం తగ్గిపోయే అవకాశం ఉందని విశ్లేషించింది. సరఫరాల్లో లోపాలతో 2024లో బ్యారెల్‌ చమురు ధర 120 డాలర్లుగా, 2025లో 100 డాలర్లుగా ఉండొచ్చని అంచనా వేసింది.