Jul 17,2023 12:15

కాట్రేనికోన (కోనసీమ) : కాట్రేనికోన మండలం బలుసుతప్పి గ్రామానికి చెందిన ఏడుగురు జాలర్లు రెండు రోజుల క్రితం పడవలో సముద్రపు వేటకు వెళ్లారు. వేట ముగించుకొని సోమవారం తెల్లవారుజామున తిరిగి వస్తున్న క్రమంలో కొత్తపాలెం మొగవద్ద సముద్ర అలల ధాటికి తట్టుకోలేక జాలర్లు ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కాలాడి సత్యబాబు అనే మత్స్యకారుడు గల్లంతయ్యాడు. ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన మత్స్యకారుడి కోసం గాలింపు కొనసాగుతోంది.