- కరేబియన్ ప్రిమియర్ లీగ్‌లో అమలు
ట్రినిడాడ్: క్రికెట్‌లో రెడ్‌కార్డ్ ఏమిటి? రెడ్‌కార్డ్ ఇచ్చేది ఫుట్‌బాల్‌లో కదా? అని అనుకుంటున్నారా..? ఇది నిజం. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఓ జట్టు రెడ్‌కార్డ్‌కు గురయ్యింది.. కరేబియన్ ప్రిమియర్ లీగ్(సిపిఎల్)లో భాగంగా సునీల్ నరైన్ సారథ్యంలోని ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ జట్టు స్లో ఓవర్ రేట్‌కు గాను రెడ్‌కార్డుకు గురై 10మంది ఫీల్డర్లతోనే మ్యాచ్ కొనసాగించింది. సిపిఎల్ నిబంధనల నిర్ణీత సమయంలోగా ఓవర్ల కోటా పూర్తిచేయని పక్షంలో ఫీల్డింగ్ జట్టుకు రెడ్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రెడ్ కార్డ్‌కు గురైన జట్టు ఒక ఆటగాడిని మైదానం నుంచి బయటకు పంపాల్సి ఉంటుంది. అంటే ఆ జట్టు 10మందితోనే ఫీల్డర్లతోనే మిగిలిన ఆటను కొనసాగించాల్సి ఉంటుంది. ఐసిసి నిబంధనల ప్రకారం మూడు ఫార్మాట్‌లలో స్లో ఓవర్ రేట్‌కు జరిమానా విధిస్తే.. సిపిఎల్‌లో తాజాగా రెడ్‌కార్డును ప్రవేశపెట్టారు.










