
తోట పాలెం : తోటపాలెంలో గల సత్య డిగ్రీ , పీజీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న కుమారి. షేక్ నూరునీష గత నెల 21వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ లో నిర్వహించిన అంతర్ కళాశాలల గేమ్స్ , స్పోర్ట్స్ 2023-24 ఉమెన్ విభాగం లో తైక్వాండోలోని కిరోగిలో 53కేజీల విభాగం లో జరిగిన పోటీలలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకొన్నారు. దీంతో నవంబర్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాజస్థాన్ జుంజున్ లో జరగబోయే జాతీయ స్థాయి అంతర్ యూనివర్సిటీ గేమ్స్ , స్పోర్ట్స్ 2023-24 లో పాల్గొనేందుకు అర్హత ను సాధించింది.
ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల సంచాలకులు డాక్టర్ ఎం. శశి భూషణ రావు మాట్లాడుతూ నీరుష జాతీయ స్థాయి లో కూడా మొదటి స్థానాన్ని సంపాదించుకొని రావాలని కోరారు. అమ్మాయిలు ఇటువంటి అంశాలలో కూడా ముందుండడం ప్రశంసనీయం అని అన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సాయి దేవ మణి మాట్లాడుతూ నీరుషా కు గతం లో కూడా ఎన్నో మెడల్స్ తైక్వాండో లో వున్నాయని ఇప్పుడు యూనివర్శిటీ స్థాయిలో పోటీ పడుతున్నది అని అన్నారు. ఈ కార్యక్రమం లో కళాశాల ఎన్ యస్ యస్ ఆఫీసర్ శ్రీ. బి. సూరపు నాయుడు, ఎన్ సి సి ఆఫీసర్ శ్రీ. ఎం. ఉదరు కిరణ్, కళాశాల అధ్యాపకులు పాల్గొని నీరుషా కు అభినందనలు తెియజేశారు.