Aug 24,2023 13:05

కాలిఫోర్నియా: కాలిఫోర్నియాలో మరోసారి కాల్పుల మోత మోగింది. భార్యపై కోపంతో భర్త కాల్పులకు పాల్పడిన ఘటన కాలిఫోర్నియాలోని ఆరెంజ్‌ కౌంటీలోని ప్రముఖ బైకర్స్‌ బార్‌ వద్ద చోటుచేసుకుంది. అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మతిచెందగా.. 6గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో అతడు హతమయ్యాడు. గాయపడిన ఆరుగురిని పోలీసులు చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రిటైర్డ్‌ పోలీసు అధికారి అని అమెరికా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.