నార్మన్ : అమెరికాలోని ఓక్లహోమా విశ్వవిద్యాలయం(ఓయు)లో ఓ ముష్కరుడు శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో కాల్పులు జరిపినట్లు పోలీసు అధికారులు శనివారం వెల్లడించారు. ముష్కరుడు క్యాంపస్‌లో ఉన్నాడని, అతన్ని తరిమికొట్టేందుకు స్థానిక ప్రజలు పరుగెత్తండి అని ఓయు యూనివర్సిటీ 9.30 గంటల సమయంలో ట్వీట్ చేసింది. దీంతో పోలీసులు అప్రమత్తమై ఓయుకి చేరుకున్నారు. విద్యార్థుల రక్షణకు పోలీసు అధికారులు ఓయు వెలుపల వాహనాలతో పహారా కాయడంతో.. యూనివర్సిటీకి, విద్యార్థులకు ఎలాంటి ముప్పు సంభవించలేదని, అక్కడున్న అత్యవసర పరిస్థితిని రద్దు చేసినట్లు ఓయు శుక్రవారం రాత్రి 10.53 గంటల సమయంలో మరో ట్వీట్‌లో తెలిపింది.
కాగా, యూనివర్సిటీలో కాల్పులు జరిపేందుకు వచ్చిన ముష్కరుడు వాన్ వ్లీట్ ఓవెల్‌లో యాక్టివ్ షూటర్ అని, అతనిపై వెంటనే చర్య తీసుకోవాలని ఓయు ట్వీట్ చేసింది. నార్మన్‌లోని ఓయు వెలుపల పోలీసు వాహనాలు ఉండటం విజువల్స్ అక్కడి స్థానిక మీడియా చూపించింది. ఇటీవల నాష్‌విల్లేలోని ఓ స్కూల్‌లో జరిగిన కాల్పుల వల్ల తొమ్మిదేళ్ల బాలికలిద్దరూ, ఓ బాలుడు, ఇద్దరు టీచర్లు మృతిచెందారు. ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ఓయు క్యాంపస్‌లో కాల్పులు జరిగడం గమనార్హం. తుపాకీ సంస్కృతికీ నానాటికీ పెరుగుతుండడంతో.. అమెరికాలోని పాఠశాలలు, కాలేజీల్లో కాల్పులు జరగడం సర్వసాధారణమైపోయింది. గన్ వయోలెన్స్ ఆర్కైవ్ డేటా ప్రకారం.. ఈ ఏడాదిలో 129 సామూహిక కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక్కో సంఘటనలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువమంది వ్యక్తులు మృతి చెందారు.