Oct 13,2023 21:24

న్యూయార్క్‌ : అమెరికన్‌ చిప్‌ దిగ్గజం క్వాల్‌కాం వందలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తోంది. దాదాపు 1258 మంది ఉద్యోగులపై వేటు వేయనుంది. ఇది ఆ సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో 2.5 శాతానికి సమానం. ఆర్థిక అనిశ్చితి, సెమీకండక్టర్‌ పరిశ్రమలో చోటుచేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా పునర్‌వ్యవస్థీకరణపై దృష్టి పెట్టినట్లు క్వాల్‌కాం వెల్లడించింది. ప్రస్తుత ఏడాది డిసెంబర్‌లోనే ఉద్వాసనలు ఉంటాయని స్పష్టం చేసింది. శాండియాగో, శాంటా క్లారా ప్లాంట్స్‌లో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. అయితే ప్లాంట్ల మూసివేత ఉండబోదని వెల్లడించింది.