Jun 24,2023 09:06

దర్శి (ప్రకాశం) : షాపింగ్‌మాల్‌లో అగ్నిప్రమాదం సంభవించి రూ.2.5 కోట్లకుపైగా ఆస్తి నష్టం సంభవించిన ఘటన శనివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో దర్శిలో జరిగింది. దర్శిలోని మేడ హనుమంతరావుకు చెందిన అభి షాపింగ్‌ మాల్‌ (బట్టలు)లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా దగ్ధమయ్యింది. ఈ అగ్నిప్రమాదంలో రూ.2.5 కోట్లకుపైగా ఆస్తి నష్టం సంభవించిందని, రూ.10 లక్షలు నగదు దగ్ధమయ్యిందని షాపు యజమాని తెలిపారు. అద్దంకి నుండి ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పే చర్యలు చేపట్టారు. షాపింగ్‌మాల్‌కు ఎలాంటి ఇన్సూరెన్స్‌ లేదని షాపు యజమాని మేడ హనుమంతరావు తెలిపాడు