ప్రజాశక్తి-ఉంగుటూరు మండలం (ఏలూరు) : బాదంపూడి నుంచి తాడేపల్లిగూడెంకు వెళ్లే రహదారిలో కంటైనర్ లారీలో అగ్ని ప్రమాదం జరిగింది. ఏలూరు నుంచి గూడెంకు వెళుతున్న లారీలో పొగలు రావటాన్ని నారాయణపూరాణికి చెందిన విశ్రాంత ఆర్మీ బాలు, పైడి వర ప్రసాద్ లు చూసి వెంటనే చెప్పడంతో వాహనదారులు డ్రైవర్‌ను అప్రమత్తం చేశారు. వెంటనే లారీని పక్కకు పెట్టి తలుపులు తెరిచే చూసేసరికి లోపల పొగ వ్యాపించింది. వాహనంలోని సామగ్రినంతటినీ కిందకి దింపేశారు. వాహనంలో పలురకాల ఔషధాలు, గృహ ఉపయోగ సామాగ్రి పెట్టెలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.










