Oct 02,2023 12:55

మాడ్రిడ్‌: స్పెయిన్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అగేయ స్పెయిన్‌లోని మర్సియా పట్టణంలోని రెండంతస్తుల నైట్‌ క్లబ్‌లో ఆదివారం ఉదయం 6గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. విషయం తెలుసుకొని తక్షణమే అక్కడకు చేరుకున్న సహాయ బృందాలు మంటలను ఆర్పివేయడానికి ప్రయత్నించాయి. అయితే భారీస్థాయిలో అగ్ని, దట్టమైన పొగ అలుముకోవడంతో సిబ్బందికి లోనికి వెళ్లడం కష్టంగా మారింది. సుమారు 10 గంటల పాటు 12 అత్యవసర వాహనాలు, పదుల సంఖ్యలో సిబ్బంది శ్రమించి ఎట్టకేలకు మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులు సమీప ఆసుపత్రులకు తరించారు.