Aug 23,2023 15:02

ప్రజాశక్తి - వేంపల్లె (కడప) : అనారోగ్యంతో ఇటివల మృతి చెందిన సుమో డ్రైవర్‌ ఆర్‌ రామకృష్ణ కుటుంబానికి సుమో స్టాండ్‌ డ్రైవర్లు, ఓనర్లు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం ఆర్ధిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ సుమో స్టాండ్‌ అధ్యక్షుడు కె.నాగేంద్ర బాబు మాట్లాడుతూ.. అనారోగ్యంతో డ్రైవర్‌ రామకృష్ణ ఆకస్మికంగా మృతి చెందడం బాధకరమని చెప్పారు. డ్రైవర్‌ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో సుమో స్టాండ్‌లో ఉన్న సుమో ఓనర్లు, డ్రైవర్లు సహకారంతో రామకృష్ణ కుటుంబానికి 30 వేలు నగదు అందించినట్లు చెప్పారు. ఆర్‌ కే కుటుంబానికి వైఎస్‌ఆర్‌ సుమో స్టాండ్‌ ఎల్లవేళలా అండగా ఉంటుందని హమీ ఇచ్చారు. వైఎస్‌ఆర్‌ సుమో స్టాండ్‌ అధ్యక్షుడు కె.నాగేంద్ర బాబు, చంద్రశేఖర్‌ రెడ్డి (దిల్‌ మ్యాంగే), స్టాండ్‌ ఉపాధ్యక్షుడు రాజగోపాల్‌ రెడ్డి, వైఎస్‌ఆర్‌ ట్రేడ్‌ యూనియన్‌ కన్వీనర్‌ ముత్యాల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి విజరు, రమణ, సూరి, రాజా, మాధవ, ఆది, రంగారెడ్డి, రామయ్య, సుధాకర్‌, శేఖర్‌, షఫి, ఓబులేసు, ఆంజి, చంద్ర పాల్గొన్నారు.