కొలంబో : ఆసియా కప్ ఫైనల్స్‌లో టీమిండియా, శ్రీలంక జట్టు తలపడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు రేపు జరగనున్న ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంకకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ మహీశ్ తీక్షణ జట్టుకు దూరమయ్యాడు. మొన్న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆయన కుడి తొడ కండరం పట్టేసింది. తొడ నొప్పి కారణంగా ఆయన రేపటి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అలాగే టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయం కారణంగా జట్టుకు దూరమైనట్లు తెలుస్తోంది. యువ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్‌తో ఈ స్పిన్ ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు బిసిసిఐ నిర్ణయించినట్లు సమాచారం.










